ETV Bharat / crime

CYBER FRAUD: కోట్ల రూపాయల ఆశ చూపి.. రూ.96 లక్షలు కాజేశారు

CYBER FRAUD: క్రిప్టోలో పెట్టుబడి పెట్టండి. రోజూ లాభాలొస్తాయ్‌ మీ తరఫున లావాదేవీలు మేం నిర్వహిస్తాం. అందుకు తమకు కమిషన్ ఇస్తే చాలు అంటూ ఓ వ్యక్తి వద్ద నుంచి సైబర్ నేరస్థులు అందినకాడికి దోచుకున్నారు. చెల్లించిన డబ్బులు రాకపోగా ఇంకా కావాలని ఒత్తిడి చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyber criminals
సైబర్‌ నేరస్థులు
author img

By

Published : Aug 12, 2022, 8:53 AM IST

Updated : Aug 12, 2022, 3:44 PM IST

CYBER FRAUD: క్రిప్టోలో పెట్టుబడి పెట్టండి.. అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.96 లక్షలు స్వాహా చేశారంటూ ఓ బాధితుడు సీసీఎస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపారు. విజయనగర్‌కాలనీకి చెందిన వ్యాపారి వాట్సాప్‌ ఖాతాను ఓ వాట్సాప్‌ గ్రూపుతో అనుసంధానం చేశారు సైబర్‌ చీటర్లు. అందులోని సభ్యులు ‘ఈరోజు తనకు రూ.లక్ష లాభం వచ్చిందని ఒకరు..రూ.1.50లక్షలు వచ్చాయ’ని ఇంకొకరు.. ఇలా చర్చ జరుగుతోంది.

బాధితుడు అందులోని సభ్యులకు ఫోన్‌లు చేసి విచారించగా..‘బినాన్స్‌’(క్రిప్టో) యాప్‌తో పాటు మరో ప్రైవేటు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. మొదట రూ.50 వేలు పెట్టారు. దానికి రూ.15 వేలు, తర్వాత రూ.18 వేలు, తర్వాత రూ.1500 డాలర్లు ఇచ్చారు. లాభంలో 30 శాతం కమీషన్‌ తమకు ఉంటుందని షరతు విధించారు. బాధితుడు ఏకంగా రూ.51వేల డాలర్లు(రూ.45 లక్షల వరకు) పెట్టేశారు. దానికి రూ.3 కోట్ల లాభం వచ్చిందని యాప్‌లో చూపిస్తోంది. కమీషన్‌ ఇస్తే ఆ డబ్బు వస్తుందని చెప్పడంతో బాధితుడు విడతల వారిగా మొత్తం రూ.96 లక్షలు చెల్లించాడు. డబ్బులు రాకపోగా ఇంకా కావాలని ఒత్తిడి చేయడంతో అనుమానం వచ్చి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమెరికాలో ఉద్యోగమని రూ.8 లక్షలు: సైదాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఆన్‌లైన్‌లో విదేశీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం అన్వేషించాడు. డేవిడ్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉంటే..‘మేరీ ల్యాండ్‌(యూఎస్‌ఏ)లోని వైటింగ్‌ టల్నల్‌లో’ ఉద్యోగం ఉందని చెప్పాడు. వీసా, అడ్వాన్స్‌, తదితర ఖర్చులంటూ మొత్తం రూ.8 లక్షలు దండుకున్నాడు. తర్వాత అందుబాటులో లేకపోవడంతో బాధితుడు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి: Singareni: ఉద్యోగాల పేరిట వల.. కోల్‌బెల్టులో దళారుల దందా

ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం- ఆరుగురు బలి

Last Updated : Aug 12, 2022, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.