ETV Bharat / crime

Bitcoin Cyber crime in Hyderabad : 'బిట్‌కాయిన్స్‌ పంపించకుంటే నీ భార్య మార్ఫింగ్‌ ఫొటోలు వైరల్‌ చేస్తాం'

Cyber crime in Hyderabad : బిట్​కాయిన్​ విలువ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. దీన్ని అవకాశంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బిట్ కాయిన్లు ఉన్నవారిని నానా రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. 'బిట్ కాయిన్లు పంపాలని... లేదంటే మార్ఫింగ్ చేసిన నీ భార్య ఫొటోను వైరల్ చేస్తామని' బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyber crime in Hyderabad, bitcoin cyber crime
బిట్ కాయిన్ కోసం వేధింపులు
author img

By

Published : Jan 4, 2022, 8:50 AM IST

Cyber crime in Hyderabad : హైదరాబాద్​ నగరవాసులను సైబర్ నేరగాళ్లు రకరకాలుగా టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల బిట్ కాయిన్ల విలువ పెరగడంతో... సైబర్ మోసాలు మరింతగా పెరిగాయి. వాటికోసం కేటుగాళ్లు ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు. ‘‘నీ ‘బిట్‌కాయిన్స్‌’ నా ఖాతాకు బదిలీ చేయకపోతే మార్ఫింగ్‌ చేసిన నీ భార్య ఫొటోలు వైరల్‌ చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారంటూ’’ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన బాధితుడు తన భార్యతో దిగిన ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి బాధితుడి భార్య ఫొటోను న్యూడ్‌గా మార్ఫింగ్‌ చేశారు. దాన్ని భర్తకే పంపించి, బాధితుడి బిట్‌కాయిన్స్‌ను తన ఖాతాకు బదిలీ చేయాలని, లేదంటే మార్ఫింగ్‌ ఫొటోలను బంధు, మిత్రులందరికీ పంపిస్తానంటూ బెదిరించాడు. రూ.1.20 లక్షలు పంపించినా డబ్బుల డిమాండ్‌ తగ్గకపోవడంతో సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

ఇదీ చదవండి: శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.