ఆన్లైన్లో ద్విచక్రవాహనం అమ్మకం పేరుతో సైబర్ మోసానికి తెరదీశాడు ఓ కేటుగాడు. ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చి నగదు బదిలీ చేయించుకుని టోకరా వేశాడు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని చెరుకుపల్లి కాలనీకి చెందిన రాజేందర్(36) రూ.63,300 చెల్లించినా వాహనం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆర్మీ ఉద్యోగానికి వెళ్తున్నానని...
తాను ఆర్మీలో ఉద్యోగానికి వెళ్తున్నానని... అందుకే తన యాక్టీవా వాహనాన్ని అమ్ముతున్నట్లు బాధితునికి ఫోన్లో తెలిపి సైబర్ నేరగాడు తన ఫేక్ ఐడీ కార్డులను అతనికి పంపించాడు. అది నమ్మిన రాజేందర్ పలు విడతలుగా నగదు బదిలీ చేశారు. వాహనం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.