ETV Bharat / crime

Junior Artist Suicide : ఆరేళ్లుగా సహజీవనం...టాలీవుడ్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య - సూసైడ్​ చేసుకున్న టాలీవుడ్​ జూనియర్​ ఆర్టిస్ట్​

ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కలిసిబతకాలని అనుకున్నారు. ఫిలింనగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు... కట్​ చేస్తే.. అతనికి మరో యువతితో నిశ్చితార్థం. ఇంకేముంది... బాధిత యువతి.. ఫ్యాన్​కు ఉరేసుకుని బలవన్మరణం (Junior Artist Suicide News) చెందింది.

Junior Artist Suicide News
Junior Artist Suicide News
author img

By

Published : Sep 30, 2021, 10:30 AM IST

Updated : Sep 30, 2021, 3:45 PM IST

ప్రియుడు మోసం చేశాడన్న మనస్తాపంతో.. టాలీవుడ్​కు చెందిన ఓ​ జూనియర్​ ఆర్టిస్ట్​ ఆత్మహత్య (Junior Artist Suicide News )చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​ బంజారాహిల్స్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

Cheating in Love:
జూనియర్​ ఆర్టిస్ట్​ అనురాధ

అసలు ఏం జరిగిందంటే...

కుత్బుల్లాపూర్‌ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) మూడు నెలలుగా కిరణ్‌ అనే యువకుడితో కలిసి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌లోని ఓ ఇంటి రెండో అంతస్తులోని గదిలో నివసిస్తోంది. ఆమె నివసిస్తున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి కింద నివసించే కొందరు యువకులు మంగళవారం రాత్రి విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లారు.

Cheating in Love:
జూనియర్​ ఆర్టిస్ట్​ అనురాధ

బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కలిసి నివసిస్తోందని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆమెకు తెలియకుండా కిరణ్‌ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని, ఈ మోసాన్ని భరించలేకనే తన సోదరి తనువు చాలించిందని మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడైన కిరణ్‌ కోసం గాలిస్తున్నారు.

Cheating in Love
కిరణ్
Cheating in Love
జూనియర్​ ఆర్టిస్ట్​ అనురాధ

ఇదీ చదవండి: ATTACK ON YOUNG WOMAN: ప్రేమోన్మాదం.. యువతిపై యువకుడి కత్తి దాడిపు చేపట్టారు

Last Updated : Sep 30, 2021, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.