ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లిలో శ్రీ బాల బాలాజీ స్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలు చోరీకి గురయ్యాయి. ఈనెల 20వ తేదీ రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో దుండగులు చోరీకి పాల్పడినట్లు ఆలయ అధికారులు భావిస్తున్నారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఆలయ సహాయ కార్యదర్శి పి.బాబురావు, ఎమ్మెల్యే చిట్టిబాబుకు వివరించారు. చోరీకి సంబంధించిన వివరాలను వేగవంతంగా దర్యాప్తు చేసి.. నిందితులను పట్టుకోవాలని ఎమ్మెల్యే చిట్టి బాబు పోలీసులను కోరారు.