ETV Bharat / crime

Cyber Crime: కొవిడ్ ఇంజక్షన్ల పేరిట రూ. 2 లక్షల మోసం

దేశంలో కొవిడ్ మహమ్మారి వేగంగా విజ‌ృంభిస్తోంది. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క, ఆక్సిజన్ అందక రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మహమ్మారి బారి నుంచి తమ వారిని రక్షించుకునేందుకు బాధిత కుటుంబ సభ్యులు అష్ట కష్టాలు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా ఇంజక్షన్ల పేరిట హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఇలాగే రూ. 2 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Cyber Crime
సైబర్ నేరగాళ్లు
author img

By

Published : Jun 24, 2021, 9:18 PM IST

సైబర్ నేరగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. కొవిడ్ ఇంజక్షన్ల పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు కాజేశారు. హైదరాబాద్​లోని చార్మినార్​కు చెందిన బాధితుడు.. కొవిడ్ ఇంజక్షన్లు తక్కువ ధరకు వస్తున్నాయని తెలుసుకుని ఆన్​లైన్​లో సెర్చ్ చేశాడు. నకిలీ వెబ్​సైట్​లో ఉన్న నంబర్​కు కాల్ చేసి బేరమాడాడు. వారు చెప్పిన బ్యాంకు అకౌంట్​లోకి రూ. 2 లక్షలు వేశాడు.

ఇంజక్షన్లు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బెంగుళూరులో ఉన్న జాఫ్ డేక్లాన్, మథియస్ ఏషా అనే ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేసి.. రిమాండ్​కి తరలించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విజ‌ృంభిస్తోంది. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క, ఆక్సిజన్ అందక రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మహమ్మారి బారి నుంచి తమ వారిని రక్షించుకునేందుకు బాధిత కుటుంబ సభ్యులు అష్ట కష్టాలు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ విధంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి సైబర్ కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంజక్షన్లను బ్లాక్​ మార్కెట్​లో కొనుగోలు చేయాలనుకుని మోసపోవద్దన్నారు.

ఇదీ చదవండి: SON KILLED FATHER: ఆ సంబంధం తప్పన్నందుకు కన్నతండ్రినే చంపాడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.