Shilpa Chowdary Case:పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన శిల్పాచౌదరిని పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. 2 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. రేపటి నుంచి 2 రోజుల పాటు శిల్పాచౌదరిని నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో అరెస్టైన శిల్పా చౌదరి భర్త శ్రీనివాస్ ప్రసాద్‌కు మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానంటూ శిల్పా చౌదరి పలువురి నుంచి కోట్లల్లో డబ్బులు తీసుకుంది. తిరిగి చెల్లించకపోవడంతో దేవి అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల ఆమె మోసాలు బయటపడ్డాయి.
శిల్పా మాయల్లో కొత్త కోణం..
Shilpa Chowdary Cheating Case : శిల్పాచౌదరి మాయలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు అధిక వడ్డీల ఆశచూపి మహిళల నుంచి కోట్లు కొల్లగొట్టిన శిల్పాచౌదరి కేసులో మరో కోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. దివానోస్ పేరుతో జూదశాలను నిర్వహించిందని సాక్ష్యాధారాలు సేకరించారు. ఇందులో 90 మంది సెలబ్రిటీల కుటుంబాల మహిళలున్నారని గుర్తించారు. శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ.కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ ఒక్కొక్కరూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు..
Shilpa Chaudhary case: అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట వల వేసి.. ఆసక్తి చూపించిన వారి నుంచి కోట్లలో డబ్బులు రాబట్టిన శిల్పాచౌదరి బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. కోటీ ఐదు లక్షలు మోసం చేసిందని దివ్య అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బయటపడిన శిల్పాచౌదరి మోసాల చిట్టా.. రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే శిల్పపై మూడు కేసులు నమోదుకాగా.. ఇప్పుడు ఇంకొకరు ఫిర్యాదు చేశారు. తన వద్ద రెండు కోట్ల తొంభై లక్షలు తీసుకుని మోసం చేసిందని మరో మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిట్టీ పార్టీల పేరిట శిల్ప తనకు పరిచయమైందని.. అధిక వడ్డీల ఆశ చూసి 2.9 కోట్ల రూపాయలు తీసుకుందని బాధితురాలు పేర్కొంది. శిల్పపై కేవలం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లోనే ఇప్పటికి మూడు కేసులు నమోదు కాగా.. ఇది నాలుగోది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
హీరో మహేశ్‌బాబు సోదరి కూడా బాధితురాలే..
Shilpa Chowdary Case News : శిల్పాచౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారంతో ఎక్కడెక్కడ భూములు కొన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. హీరో మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని తన వద్ద నుంచి రూ. 2 కోట్లకు పైగా నగదు తీసుకుని శిల్పాచౌదరి మోసం చేసిందంటూ కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని నార్సింగి పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అసలు బుట్టలో ఎలా వేసుకునేదంటే..
Shilpa fraud: మోసం చేయడమే ఆమె లక్ష్యం. భార్య చేసే మోసాలకు వత్తాసు పలకడమే భర్త లక్షణం. అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట వల వేసి.. వారి నుంచి కోట్లలో డబ్బులు తీసుకుని.. విలాసవంతమైన జీవితాన్ని గడపడమే ఆ దంపతుల ధ్యేయం. అలా మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి గుట్టు ఎట్టకేలకు బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త శిల్పను, ఆమె భర్త శ్రీనివాస్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి