ETV Bharat / crime

Couple Sold a Baby Girl: పెంచుకుంటామని.. మరొకరికి అమ్మేసి.. - పాడేరులో చిన్నారిని అమ్మేసిన దంపతులు

Couple Sold a Baby Girl: ఆడపిల్లలంటే ఇష్టమని.. పెంచుకుంటామని నమ్మించి.. రహస్యంగా ఆ శిశువును విక్రయించిన ఘటన ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగింది. విషయం తెలుసుకున్న ఛైల్డ్‌లైన్‌ టీమ్‌ 24 గంటల్లోనే శిశువును సంరక్షించి శిశు సంక్షేమ సంఘానికి అప్పగించారు.

Couple Sold a Baby Girl
Couple Sold a Baby Girl
author img

By

Published : May 10, 2022, 11:55 AM IST

Couple Sold a Baby Girl: ఆడపిల్లలంటే ఇష్టమని.. పెంచుకుంటామని ఓ మహిళ వద్ద బిడ్డను తీసుకున్న దంపతులు రహస్యంగా శిశువును విక్రయించిన ఉదంతమిది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు పట్టణ శివారు తుంపాడ గ్రామానికి చెందిన మహిళ తనకు పుట్టిన బిడ్డను పెంచే ఆర్థిక స్థోమత లేక ఎనిమిది రోజుల తర్వాత ఈనెల 2న పొరుగునున్న గుణవతి, కృష్ణమూర్తి దంపతులకు ఇచ్చేసింది.

తమకు ఆడబిడ్డలంటే ఎంతో ఇష్టమని, అల్లారుముద్దుగా పెంచుకుంటామని నమ్మించిన సదరు దంపతులు సూర్యప్రకాశ్‌కు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఛైల్డ్‌లైన్‌ టీమ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 7న పాడేరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ సుధాకర్‌ నాలుగు బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల్లోనే కేసును ఛేదించారు.

సూర్యప్రకాశ్‌ విశాఖ మర్రిపాలెంలో బిడ్డను ఉంచినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడ శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శిశు సంక్షేమ సంఘానికి సంరక్షణ నిమిత్తం అప్పగించారు. ఈ కేసులో గుణవతి, సూర్యప్రకాశ్‌, మధ్యవర్తి పద్మను అరెస్టు చేశారు. 24 గంటల్లో ఈ కేసును ఛేదించిన సీఐ సుధాకర్‌, ఎస్సై లక్ష్మణ్‌ బృందాన్ని ఎస్పీ సతీశ్‌ కుమార్‌, ఏఎస్పీ జగదీశ్‌ అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.