నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లో మారుస్తున్న దంపతులు వరంగల్ పోలీసులకు చిక్కారు. నగరంలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు రమేశ్, సరస్వతి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యూట్యూబ్‌లో చూసి తయారు చేశారని పేర్కొన్నారు. ఇందుకోసం స్కానర్‌తో కూడిన కలర్ ప్రింటర్, కరెన్సీకి అవసరమైన కాగితాలను కొనుగోలు చేశారని అన్నారు. రూ.2వేలు, 500, 200, 100, 50,20 నోట్లను ముద్రించి దుకాణాల్లో మారుస్తున్నారని వెల్లడించారు.
నకిలీ నోట్లకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వీరిని అరెస్ట్ చేసి ముద్రణా పరికరాలతోపాటు, 10లక్షల 9 వేల 960 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదీ చదవండి: Corona Vaccine: విదేశీ టీకాల రాకకు లైన్‌క్లియర్..!