ETV Bharat / crime

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా రోగి మృతి - corona patient died in warangal

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్న కరోనా రోగి మృతి చెందాడు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల వెంటిలేటర్ పనిచేయకే బాధితుడు మరణించాడని అతని బంధువులు ఆరోపించారు.

corona patient died in warangal mgm hospital
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా రోగి మృతి
author img

By

Published : Mar 20, 2021, 2:53 PM IST

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గాంధీ అనే కరోనా రోగి మృతి చెందాడు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం రావడం వల్ల.. ఒక వెంటిలేటర్‌ నుంచి మరో వెంటిలేటర్‌పైకి మార్చే క్రమంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగార్జున రెడ్డి తెలిపారు.

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా రోగి మృతి

మృతుడు గాంధీకి కరోనా సోకగా 29 రోజులుగా ఎంజీఎం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు నాగార్జున రెడ్డి వెల్లడించారు. కరోనా చికిత్స పొందుతున్న గాంధీని... వెంటిలేటర్‌ నుంచి సాధారణ బెడ్‌ మీదకు మార్చారని... ఆ కారణంగానే మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.