యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రావిపహాడ్‌లో మైలారం నరేశ్ అనే ఓ యువకుడు కొవిడ్‌కు బలయ్యాడు. కరోనా మృతి కావటంతో కుటుంబసభ్యులు పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని జేసీబీలోకి ఎక్కించారు. అనంతరం గ్రామ శివారులో దహన సంస్కారాలను పూర్తి చేశారు.
మృతుడు నరేశ్ ఉప్పల్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. 10 రోజుల కిందట పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఫలితంగా రావిపహాడ్ చేరుకొని, ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటుండగా.. తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. నరేశ్‌కు వివాహమై ఏడాది కూడా పూర్తి కాలేదని, భార్య ప్రస్తుతం గర్భవతి అని బంధువులు తెలిపారు.
ఇదీ చూడండి: జవహార్‌నగర్ ఆరో డివిజన్ కార్పొరేటర్‌పై అత్యాచారం కేసు