యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీసు స్టేషన్లో జలీల్ పటేల్... కానిస్టేబుల్(పి.సి.నెం 4281)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బదిలీల్లో భాగంగా అధికారులు అతనిని నల్గొండకు ట్రాన్స్ఫర్ చేశారు.
ఇదే విషయమై జలీల్... ఈనెల 15న సాయంత్రం 5.30 గంటల సమయంలో తన తమ్ముడు రశీద్కు ఫోన్ చేశాడు. తనను అన్యాయంగా గుండాల పోలీసుస్టేషన్ నుంచి నల్గొండకు బదిలీ చేశారని... తనకు వెళ్లడం ఇష్టం లేదని తెలిపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అనంతరం ఫోన్ ఆఫ్ చేసి.. ఆచూకీ లేకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిపారు. జలీల్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: హైకోర్టు న్యాయవాది దంపతులను నరికిచంపిన దుండగులు