సికింద్రాబాద్ పరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనాని(GANESH IMMERSION)కి వెళ్తున్న రెండు వర్గాల మధ్య మాటలు ఘర్షణకు దారితీశాయి. సికింద్రాబాద్ అంజయ్యనగర్కు చెందిన వారు.. మంగళవారం రాత్రి వినాయకుని నిమజ్జనానికి స్థానిక హస్మత్పేట్ బోయిన్ చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ముందున్న మరో వాహనాన్ని తీయమన్నందుకు రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు దారితీసింది.
ఆ సమయంలో నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్న అల్వాల్ పోలీసులు.. ఘటనలో జోక్యం చేసుకుని వారిని నివారించే ప్రయత్నం చేశారు. అయినా గొడవ ఆగలేదు. దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గొడవకు కారణమైన వారిపై చర్యలు తప్పవని పోలీసులు స్పష్టంచేశారు.
ఇదీ చదవండి: National Sample Survey: ఆ విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్.. నేషనల్ సర్వే రిపోర్ట్!