సంగారెడ్డి జిల్లా నందిగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో కొందరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో పదోతరగతి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల ఆవరణలో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా వారి మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. అది కాస్త పెద్దది కావడంతో ఒక టీం విద్యార్థులు మరో టీం విద్యార్థి కాలిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశారు.
అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. గాయాలతో ఉన్న బాలుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించింది. దీనిపై బాధితుని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు.
ఇదీ చదవండి: చేతికొచ్చిన పంటకు నిప్పంటించిన దుండగులు