ETV Bharat / crime

viral video: వియ్యంకుల మధ్య గొడవ... వైరల్​గా మారిన దృశ్యాలు - telangana news

ఏడడుగులు... మూడుముళ్లతో ముడిపడిన వివాహ బంధం ఆర్థిక గొడవలతో వివాదాస్పదమైంది. భర్త ఇటీవల ఆత్మహత్య చేసుకోవటంతో భార్యకు కష్టాలు మొదలయ్యాయి. కళ్లెదుటే అత్తమామలు, తల్లిదండ్రులు రాళ్లతో దాడి చేసుకోవటంతో చేతిలో చంటిబిడ్డను ఒడిలో పట్టుకుని కన్నీటిపర్యంతమైంది ఆమె.

viral video, relatives conflict
వియ్యంకుల మధ్య గొడవ, వైరల్ వీడియో
author img

By

Published : Sep 3, 2021, 3:01 PM IST

చెంపదెబ్బలతో మొదలుపెట్టి రాళ్ల దాడికి దిగిన వీళ్లు వియ్యంకులు. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంలో ఏడాది క్రితం.. పిల్లల పెళ్లిళ్లు జరిపించారు. ఆ తర్వాత కట్నకానుకలంటూ మొదలైన గొడవ క్రమంగా పెరిగి పెద్దదై.. సిగపట్ల వరకూ వచ్చింది. చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ప్రభాకర్‌ రెడ్డి కుమార్తె ఊహారెడ్డిని నెల్లూరు రూరల్‌ ధనలక్ష్మీ పురానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి కుమారుడు అఖిల్‌ కుమార్‌ రెడ్డికి ఇచ్చి ఏడాది క్రితం పెళ్లి చేశారు.

అఖిల్‌ రెండు నెలల క్రితమే రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచీ కోడలికీ, అత్తమామలకూ మధ్య గొడవలు పెరిగాయి. కోడలే తమ కుమారుడు మరణానికి కారణమని నాగేశ్వర్‌రెడ్డి దంపతులు ఆరోపించగా... కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతోనే తన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడని ఊహారెడ్డి వాపోతోంది. ఈ పరస్పర ఆరోపణలు పెద్ద గొడవకు దారితీయటంతో కోడలిని అత్తమామలు ఇంట్లోకి రానియ్యలేదు.

వియ్యంకుల మధ్య గొడవ వైరల్

దీన్ని ప్రశ్నించేందుకు ఊహారెడ్డిని వెంటబెట్టుకుని తల్లిదండ్రులు.. నేరుగా వియ్యంకుడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి బహిరంగంగా దాడి చేస్తుకున్నారు. 6 రోజుల క్రితం జరిగిన కొట్లాట దృశ్యాలు వైరల్‌గా మారటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును లోతుగా విచారించి త్వరలోనే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: Woman allegations: 'పక్కింటికి వీధిపోటు అని.. మా దర్వాజ కూల్చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.