తన దగ్గర అప్పు తీసుకుని మోసం చేశారంటూ సినీ నటుడు, ‘నువ్వే కావాలి’ ఫేమ్ సాయికిరణ్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. అప్పు తీసుకోవడమే కాకుండా తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నాలుగు రోజుల క్రితమే సాయికిరణ్ ఫిర్యాదు చేయగా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిర్మాత జాన్‌బాబు, లివింగ్ స్టన్ తన వద్ద రూ.10.6 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారని సాయికిరణ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా డబ్బులు అడిగితే తనను బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నటుడి ఫిర్యాదు మేరకు జాన్‌బాబు, లివింగ్ స్టన్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: