ETV Bharat / crime

ఇరువర్గాల ఘర్షణ.. అడ్డుకున్న పోలీసులపై దాడికి యత్నం..!

Racharla Gollapalli Conflict: మద్యం మత్తులో రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఇరువర్గాల ఘర్షణ.. అడ్డుకున్న పోలీసులపై దాడికి యత్నం..!
ఇరువర్గాల ఘర్షణ.. అడ్డుకున్న పోలీసులపై దాడికి యత్నం..!
author img

By

Published : May 9, 2022, 4:17 PM IST

Racharla Gollapalli Conflict: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఇరువర్గాల ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన పలువురు ఆదివారం సాయంత్రం స్థానిక మద్యం దుకాణం వద్ద మద్యం మత్తులో గొడవపడ్డారు. ఈ గొడవ కాస్తా.. పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. విషయం తెలిసి.. ఇరు వర్గాలకు చెందిన వారు వైన్స్​ వద్దకు చేరుకున్నారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎస్సై శేఖర్​, మరో కానిస్టేబుల్​పై ఇరువర్గాలు దాడికి యత్నించాయి. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం వల్ల కేసు నమోదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..

మద్యం మత్తు.. మంచినీళ్లు అనుకొని యాసిడ్‌ కలుపుకొని తాగి వ్యక్తి మృతి

నమ్మించి లక్షలు చోరీ.. చనిపోయినట్లు డ్రామా.. 9 నెలల తర్వాత సీన్​ రివర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.