ETV Bharat / crime

‘ఫోన్‌ నంబర్‌ ఇవ్వకపోతే రేప్‌ చేస్తా’: యువతికి బెదిరింపు - రాయదుర్గం తాాజా సమాచారం

హైదరాబాద్‌ రాయదుర్గం పరిధిలోని ఓ బార్‌లో ఫోన్​ నంబర్ విషయంలో.. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Young men and women attacking each other at the bar

author img

By

Published : Jun 21, 2022, 2:19 PM IST

Updated : Jun 21, 2022, 6:15 PM IST

హైదరాబాద్‌ శివారు రాయదుర్గం పరిధిలోని ఓ హోటల్‌లో ఇరు వర్గాలు ఘర్షణకు దిగి పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన హ్యూమన్‌ రైట్స్‌ కాన్సుల్‌లో న్యూట్రిషన్‌గా పనిచేసే ఓ యువతి తన ఇద్దరు స్నేహితులు బాక్సర్‌ విక్రమ్‌, విష్ణులతో కలిసి ఈనెల 18న అర్ధరాత్రి రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో ఐటీసీ కోహినూర్‌ హోటల్‌కు వెళ్లింది.

అప్పటికే అక్కడ మయాంక్‌ అగర్వాల్‌, అబ్రార్‌, ఆరిఫ్‌ ఉద్దీన్‌, ఖాదర్‌తో పాటు మరో ఇద్దరు అదే హోటల్‌లోని బార్‌లో ఉన్నారు. ఈ క్రమంలో మయాంక్‌ అగర్వాల్‌ ఆ యువతి ఫోన్‌ నంబర్‌ అడిగారు. ఫోన్‌ నంబర్ ఇచ్చేందుకు నిరాకరించడంతో అత్యాచారం చేస్తామని బెదిరించారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆమె స్నేహితులు విక్రమ్‌, విష్ణులు మయాంక్‌ గ్రూప్‌తో గొడవకు దిగారని, ఆపై పరస్పరం దాడి చేసుకున్నారని తెలిపింది. ఈ ఘర్షణలో అబ్రార్‌కు గాయాలయ్యాయి. దీనిపై ఆదివారం రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో అబ్రార్‌ ఫిర్యాదు చేయగా, ఈరోజు ఉదయం యువతి ఫిర్యాదు చేసింది. సీసీటీవీ పుటేజీ పరిశీలించి తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను కోరింది. ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 21, 2022, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.