ETV Bharat / crime

షార్​లో వరుస ఆత్మహత్యలు.. నిన్న భర్త.. నేడు భార్య - ap crime updates

WOMAN SUICIDE IN SHAR: శ్రీహరికోటలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే ఓ జవాన్​, ఎస్సై బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు మరవకముందే మరో ఘోరం చోటుచేసుకుంది. ఎస్సై వికాస్​ సింగ్​ భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త మృతిని తట్టుకోలేని ఆమె.. గెస్ట్​హౌస్​లో ఫ్యాన్​కు ఉరేసుకుని తనువు చాలించింది.

suicide
suicide
author img

By

Published : Jan 18, 2023, 10:55 AM IST

WOMAN SUICIDE IN SHAR: తిరుపతి జిల్లా శ్రీహరికోటలో మరో విషాదం చోటుచేసుకుంది. కేవలం 2 రోజుల వ్యవధిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మధ్యాహ్నం సీఐఎస్ఎఫ్ ఎస్‌.ఐ. వికాస్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే.. అతని భార్య ఆత్మహత్య చేసుకుంది. శ్రీహరికోటలోని గెస్ట్‌హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త మృతి తెలుసుకున్న నర్మద వాళ్ల అన్నతో కలిసి శ్రీహరికోట వచ్చింది. భర్త వికాస్‌సింగ్‌ మృతి తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడింది.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వికాస్‌ సింగ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో కుమారుడు ఒకటో తరగతి, కుమార్తె ఎల్‌కేజీ, మరో కుమార్తె చిన్నపాప. ఇందులో ఓ కుమార్తె వికలాంగురాలు. ఇతని మృతిపైనా అనుమానాలున్నాయి. 2015 బ్యాచ్‌కు చెందిన ఇతను శిక్షణానంతరం ముంబయిలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తూ.. గతేడాది నవంబరులో బదిలీపై వచ్చారు. ముంబయిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో క్రమశిక్షణ చర్యలకు గురైనట్లు తెలిసింది. దీనిపై విచారణ జరుగుతోంది. అప్పులు సైతం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

SUICIDES IN SHAR: అసలు షార్​లో ఏం జరుగుతోంది: దేశానికే తలమానికమైన భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కేంద్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఇక్కడి కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు రక్షణ కవచంగా ఉంటాయి. ఇంతటి కీలకమైన కేంద్రంలో 24 గంటల వ్యవధిలో కానిస్టేబుల్‌, ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో ఇదే తరహాలో మరో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలున్నాయి. ఎంతో ప్రశాంతమైన షార్‌లో సిబ్బంది ఆత్మహత్యలపై భిన్న వాదనలు ఉన్నాయి.

శ్రీహరికోటలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల యూనిట్‌లో 947 మంది వరకు పలు స్థాయిల్లో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో మహిళలు 90 మంది ఉన్నారు. షార్‌లో పనిఒత్తిడి పెద్దగా ఉండదని.. ప్రయోగాలు, వీవీఐపీలు వచ్చినప్పుడు మినహా మిగిలిన సమయాల్లో హడావుడి ఉండదని చెబుతారు. వీరికి ప్రతి మూడేళ్లకోసారి బదిలీ తప్పనిసరి. కొవిడ్‌-19 నేపథ్యంలో రెండేళ్లపాటు సాధారణ బదిలీలు జరగలేదు.

గతేడాది అక్టోబరులో వాటిని నిర్వహించిన నేపథ్యంలో 500 మంది వరకు పలు ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో కొత్తవారు వచ్చారు. ఎక్కువ మంది కుటుంబ సభ్యులకు దూరంగా ఇక్కడి బ్యారెక్‌లలో ఉంటుండగా.. వారిలో పలువురు మనోవేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు.

తాజా ఘటనలు పరిశీలిస్తే..

  • కానిస్టేబుల్‌ చింతామణి మృతికి పెళ్లి నిశ్చయించడమే కారణమని తెలుస్తోంది. ఇతనికి తల్లిదండ్రులు లేరు. అన్నయ్య ఉన్నారు. ఇష్టం లేకున్నా బలవంతంగా పెళ్లి చేస్తుండటంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.