CISF Constable commits suicide: కేంద్ర పారిశ్రామిక భద్రత దళం(సీఐఎస్‌ఎఫ్)లో రెండేళ్ల క్రితం విధుల నుంచి తొలగించిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కావుకూరులోని అటవీ ప్రాంతానికి యూనిఫామ్ వేసుకుని వచ్చి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం రవీందర్‌ను విధుల నుంచి తొలగించడంతో మనస్తాపానికి గురై ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: