జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కుంభం రవీందర్ రెడ్డి(58) కరోనాతో మృతి చెందారు. మృతుని అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి దంపతులు.. అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్యే దంపతుల వెంట భూపాలపల్లి నియోజకవర్గ అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు.