ETV Bharat / crime

అమ్మా ఎక్కడున్నావు.. త్వరగా రా.. నాన్న మమ్మల్ని పట్టించుకోవడం లేదు..?

ఓ మహిళ భర్తతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయినప్పటి నుంచి భర్త కూడా ఇంటికి వెళ్లలేదు. ఇంట్లో ఇద్దరు చిన్నారులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న ఆ చిన్నారులు స్థానికుల సాయంతో పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. తమ తల్లిని వెతికి తమకు అప్పగించాలని పోలీసులను వేడుకున్నారు. ఆ చిన్నారుల పరిస్థితి చూసి పోలీసులు కూడా చలించిపోయారు. ఈ సంఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

Hyderabad
Hyderabad
author img

By

Published : Feb 2, 2023, 10:29 AM IST

అమ్మా.. నువ్వు ఎక్కడున్నా త్వరగా రా.. నువ్వు వెళ్లినప్పటి నుంచి నాన్న ఇటు వైపు రాలేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. అంటూ ఇద్దరు చిన్నారులు తమ తల్లి కోసం జూబ్లీహిల్స్‌ ఠాణా మెట్లు ఎక్కారు. తమ తల్లిని తమకు అప్పగించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో నివసించే మహిళ (37) జనవరి 17న భర్తతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

వారికి పదో తరగతి చదువుతున్న కుమారుడు(15), తొమ్మిది చదువుతున్న కుమార్తె(13) ఉన్నారు. తల్లి ఇల్లు వదిలివెళ్లిన రోజు నుంచి తండ్రి సైతం ఇంటికి రావడం లేదు. దీంతో చిన్నారులే ఇంట్లో తమ బంధువులతో కలిసి బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఈ క్రమంలోనే తమ తల్లిని త్వరగా అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆమె కోసం వెదుకుతున్నారు. మరోవైపు ఆమె భర్తను విచారించేందుకు ఠాణాకు రావాలంటూ ఇప్పటికే పోలీసులు సూచించారు. గతంలోనూ ఆమె భర్తతో గొడవ పడి ఇలానే రెండు, మూడు సార్లు ఇళ్లు విడిచి వెళ్లిందని పోలీసులు చెబుతున్నారు. ఆమె జాడను త్వరగా గుర్తించాలని, చిన్నారుల ఆవేదనను తీర్చాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి: హైదరాబాద్​లో మరో భారీ అగ్నిప్రమాదం.. బాగ్‌లింగంపల్లిలో ఎగిసి పడుతున్న మంటలు

అదుపుతప్పి కారుపై పడ్డ లారీ.. తల్లీకూతుళ్లు మృతి.. గోదాంలో మరో ఇద్దరు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.