ETV Bharat / crime

Child Sexual Abuse: చిన్నారులపై అఘాయిత్యాలు.. విషబీజాలు నాటుతున్న కామాంధులు - చిన్నారులపై లైంగిక వేధింపులు

Child Sexual Abuse: చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కామాంధుల తీరు మాత్రం మారట్లేదు. కామ వాంఛ తీర్చుకునేందుకు చిన్నా పెద్ద, వావివరుసలు మరిచి వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నారులు అని చూడకుండా.. వారిలో ఓ విష బీజాన్ని వేస్తూ.. బాల్యాన్ని చిదిమేస్తున్నారు. అయిన వారే పిల్లలను కాటేస్తుంటే.. వారికి భద్రతను ఇంకెవరిస్తారు?

Child Sexual Abuse, Child Sexual Abusing cases
చిన్నారులపై అఘాయిత్యాలు
author img

By

Published : Jan 4, 2022, 8:46 AM IST

Child Sexual Abuse: మహానగరంలో నిత్యం ఏదో మూలన బాలికలపై అఘాయిత్యం, చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే పసిపిల్లలను కాటేస్తున్నారు. కొందరు లైంగిక దాడులను వీడియోలుగా తీసి బాలికలను బెదిరిస్తున్నారు. ఈ వికృతాలపై గణాంకాలు పరిశీలిస్తే పరిచయస్థులు/బంధువులే ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

  • ఆ ఇద్దరు ఆడపిల్లలకు అమ్మ దూరమైంది. కడుపులో పెట్టుకుని సాకాల్సిన తండ్రిలో వికృత రూపం బయటపడింది. మద్యం మత్తులో పెద్దకూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యం బారినపడటంతో బంధువులు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించాక అసలు విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌ సీఐ కె.కనకయ్య ఆ ఇద్దరు పిల్లల్ని సంరక్షణ కేంద్రంలో చేర్చి ఆలనాపాలనా చూస్తూ మానవత్వం చాటుకున్నారు.
  • రక్షణ కల్పించాల్సిన కానిస్టేబుల్‌.. ఇంటిపై భాగంలో అద్దెకు ఉంటున్న కుటుంబంలోని 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఎవరూ లేనప్పుడు వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక తల్లి ఇంటికి రావటంతో దారుణం వెలుగు చూసింది. శంకరంపల్లి పోలీసులు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు.

దాడులు.. బెదిరింపులు

గతేడాది ఎల్బీనగర్‌లో మానవ మృగం పసికందుపై అఘాయిత్యానికి పాల్పడి దారుణంగా హతమార్చటం సంచలనం రేకెత్తించింది. బంజారాహిల్స్‌లో ఒక మహిళ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటంపై తాజాగా కేసు నమోదైంది. లాక్‌డౌన్‌ సమయంలో పిల్లలపై అఘాయిత్యాలు మరింత పెరగటం ఆందోళన కలిగిస్తోంది. అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు పొక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. పక్కా ఆధారాలతో నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నామని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

వివరాలు

పోర్న్‌ వీడియోల ప్రభావం!

లైంగికదాడులు పెరిగేందుకు పోర్న్‌ వీడియోలు ప్రభావమే కారణమంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు డాక్టర్‌ రాంచందర్‌. ఆన్‌లైన్‌ తరగతులతో పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు దగ్గరయ్యాయి. అంతర్జాలంలో పిల్లలు ఏం చూస్తున్నారనే అంశంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడింది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన కొత్త వ్యక్తులకు తమ వ్యక్తిగత వివరాలు పంచుకుంటున్నారు. మాయగాళ్లు బాలికలను మాటలతో ఆకట్టుకుని ఫొటోలను సేకరించి, మార్ఫింగ్‌ చేసి బెదిరించి దండుకుంటున్నారు.

ఇదీ చూడండి: బాల్యాన్ని చిదిమేస్తున్న 'నీలి' సంస్కృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.