రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న పది మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. స్మైల్ బృందం, బచ్పన్ బచావో ఆందోళన్ అధికారులు వారిని చెర నుంచి కాపాడారు. వారందరూ బీహార్‌లోని గయా ప్రాంతానికి చెందిన వారిగా చెబుతున్నారు. చిన్నారులంతా కేవలం ఎనిమిది సంవత్సరాలు వయస్సు గలవారేనని బచ్పన్ బచావో ఆందోళన్ స్టేట్ కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
పిల్లలతో పని చేయిస్తున్నారన్న పక్కా సమాచారంతో మైలార్‌దేవ్‌పల్లిలోని శమ్మకాలనీలో స్మైల్ టీమ్, బచ్పన్ బచావో ఆందోళన్ అధికారులు దాడులు చేశారు. వారితో పని చేయిస్తున్న బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో స్మైల్ టీమ్ శంషాబాద్ జోన్ ఇంచార్జి సత్తయ్య ఆధ్వర్యంలో రెస్క్యూ చేసి వారిని పట్టుకున్నారు.
ఇదీ చూడండి: Dating Doctor: డేటింగ్ యాప్ ద్వారా డాక్టర్ ఛీటింగ్