ETV Bharat / crime

Baby Fell From Building: ఐదో అంతస్తు నుంచి పడి చిన్నారి మృతి - hydrabad crime news

CHILD DIED IN HYDERABAD
CHILD DIED IN HYDERABAD
author img

By

Published : Nov 17, 2021, 3:09 PM IST

Updated : Nov 17, 2021, 3:41 PM IST

15:07 November 17

ఐదో అంతస్తు నుంచి పడి చిన్నారి మృతి

హైదరాబాద్​ హబీబ్​నగర్​ పరిధి మల్లేపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.  ఓ భవనంలో ఐదో అంతస్తు నుంచి పడి ఓ చిన్నారి (baby fell from building in hyderabad) మృతిచెందింది. అప్పడి వరకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ సందడి చేసిన చిన్నారి ఇక లేదనే వార్తతో ఆ ప్రాంతమంతా విషాదం ఛాయలు అలముకున్నాయి.

మల్లేపల్లిలో భవనం ఐదో అంతస్తు నుంచి ఏడాది చిన్నారి (baby fell from building in hyderabad) అక్షర పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే నీలోఫర్​ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్షర మృతిచెందింది.  

గతవారం ఏపీలో ఇటువంటి ఘటనే..

ఇటీవల ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరులో ఇలాంటి ఘటనే జరిగింది. గట్టెం బాలరాజు, రమణి దంపతులు తాడిగడప యనమలకుదురు సాయినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ కింది అంతస్తులో నివసిస్తున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు, ఏడాదిన్నర కుమార్తె నేహానందసాయి ఉన్నారు.  

నవంబర్​ 10 ఉదయం తల్లి ఇంటి పనిలో నిమగ్నమవగా.. తండ్రి ఆటోనగర్‌లోని తన దుకాణానికి వెళ్తూ కుమార్తెను అదే అపార్ట్‌మెంట్‌ రెండో అంతస్తులో నివసిస్తున్న తాత ఈశ్వరరావు వద్ద విడిచి పెట్టారు. కాసేపటి తర్వాత నేహ ఆడుకుంటూ బయటకు వచ్చింది. గ్రిల్స్‌లో నుంచి కిందకు చూస్తూ ప్రమాదవశాత్తు పడిపోయింది (baby fell from building in AP). కుటుంబసభ్యులు వెంటనే పాపను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా కొద్ది సేపటికే మృతి చెందింది. చిన్నారి బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు గుర్తించారు. అపార్ట్‌మెంట్‌ వరండాలో ఏర్పాటు చేసిన గ్రిల్స్‌కు నడుమ ఖాళీ ఎక్కువగా ఉండడంతో పాప అందులో నుంచి కిందపడి ఉంటుందని భావిస్తున్నారు. 

ఇదీచూడండి: Fire accident today: అపార్టుమెంట్​లో చెలరేగిన మంటలు.. ఉక్కిరిబిక్కిరైన వ్యక్తి

Last Updated : Nov 17, 2021, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.