బంధువులను సంతోషంగా విదేశాలకు సాగనంపి.. సొంతూరుకు పయనమవుతున్న ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కారు డ్రైవర్ నిద్ర మత్తు(Road accident)లోకి వెళ్లడంతో.. అతని నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది.
నిజామాబాదు నగరంలోని బర్కత్ పురా కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన రసూల్ ఖురూషి(28), రహత్ బేగం(55), అక్బరుద్దీన్(42), మారియాలు(7).. మంగళవారం హైదరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్(Road accident)లో ఉన్న తమ బంధువులు విదేశాలకు వెళ్తుండటంతో వీడ్కోలు చెప్పడానికి కారులో వెళ్లారు. వీడ్కోలు అనంతరం బుధవారం సిటీలోనే ఉండి అర్ధరాత్రి దాటిన తర్వాత సొంతూరుకు బయలుదేరారు.
కారు కామారెడ్డి జిల్లాకు చేరుకునే సరికి తెల్లవారుజాము నాలుగు గంటలైంది. ఆ సమయంలో బిక్కనూర్ మండలం జంగంపల్లి(Road accident) శివారులోని కృష్ణమందిరం వద్ద నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. కారును చెట్టుకు ఢీకొట్టాడు. ఘటనలో చిన్నారి మారియా అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి(Road accident) తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వస్తున్న అడ్వకేట్ మక్సూద్(Road accident) వారిని గమనించారు. అప్రమత్తమై అంబులెన్స్ సాయంతో వారిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను హైదరాబాద్ తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: Record Level Liquor Sales: మద్యం అమ్మకాల్లో అక్టోబరు నెల ఆల్‌టైం రికార్డు.. ఎంతంటే?