ETV Bharat / crime

పోలీసుల కళ్లు గప్పి పదమూడేళ్లకు చిక్కి... - Cheater arrest in bengalur

చదివింది ఇంజినీరింగ్‌. సులువుగా డబ్బు సంపాదించుకున్నాడు. అందుకు అడ్డదారులు ఎంచుకున్నాడు. పదమూడేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఛాలెంజింగ్​గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.

donga
donga
author img

By

Published : May 25, 2021, 10:45 PM IST

ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సులువుగా డబ్బు సంపాదించి కోట్లకు పడగెత్తాలని అడ్డదారి తొక్కిన ఓ ప్రబుద్దుడు పదమూడేళ్లుగా తప్పించుకొని పోలీసులకు చిక్కాడు. కామారెడ్డికి చెందిన కుందన శ్రీనివాసరావు నకిలీ కిసాన్ వికాస్‌ పత్రాలతో బ్యాంకులకు బురిడీ కొట్టించి కోటి రూపాయలకు పైగా రుణాలు పొందాడు. అతనిపై కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, గుంటూరు జిల్లాల్లో అనేక కేసులు నమోదు అయ్యాయి.

దాదాపు 40 కేసుల్లో కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. 2008 వరకు కోర్టుకు హాజరైన శ్రీనివాసరావు ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. భార్య పిల్లలకు చిక్కకుండా పేర్లు మార్చుకొని నకిలీ ఆధార్‌, పాన్‌కార్డును సృష్టించుకొని తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా కృషి చేయడంతో బెంగళూరులో పట్టుబడినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.