CHAIN SNATCHING SECUNDERABAD: సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మారుతి నగర్ వద్ద రహదారిపై ఒంటరిగా వెళ్తున్న ఓబులమ్మ అనే మహిళను లక్ష్యంగా చేసుకొని గొలుసు దొంగతనానికి పాల్పడ్డారు. మార్కెట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వెనకనుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. వెంటనే అప్రమత్తమైన ఓబులమ్మ స్థానికులను పిలవగా వారు పోలీసులకు సమాచారం అందిచారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. సీసీకెమెరాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం.. నిరోధానికి మరింత పకడ్బందీ చర్యలు