ఏపీలోని విశాఖ సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అప్పలరాజు.. నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని, ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య పద్మ... మహిళా చేతనను ఆశ్రయించారు. ప్రెస్‌క్లబ్‌లో బాధితురాలు సమావేశం నిర్వహించి.. వివరాలు వెల్లడించారు. అయిదో పెళ్లికి సిద్ధమైన అప్పలరాజును నిలదీయడంతో తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె వాపోయారు.
తనకు నాలుగుసార్లు గర్భస్రావం చేయించాడని కన్నీటిపర్యంతమయ్యారు. మహిళా చేతన అండతో దిశా పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్ అప్పలరాజుపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. అప్పలరాజును తక్షణమే విధుల నుంచి తొలిగించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ganja cultivation in hyderabad: యువకుల హైటెక్ డ్రగ్స్ దందా.. ఇంట్లోనే గంజాయి సాగు!