ETV Bharat / crime

CBI: సప్తర్షి హోటల్స్​ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన సీబీఐ - సీబీఐ తాజా వార్తలు

నాలుగు నక్షత్రాల హోటల్, సర్వీస్ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తామని ప్రభుత్వ రంగ నిథమ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టు పేరిట బ్యాంకు నుంచి రుణాలు పొందిన సొమ్మును ఇతర వ్యాపారాల కోసం మళ్లించి రుణాలు ఎగవేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్టియానికి 159 కోట్ల నష్టం చేశారన్న అభియోగంపై సప్తర్షి హోటల్స్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఫర్నీచర్, ఇంటీరియల్ వస్తువుల పేరిట సొమ్ము చేజిక్కించుకున్న సంస్థలనూ నిందితులుగా చేర్చింది.

CBI
సీబీఐ
author img

By

Published : Aug 27, 2021, 3:50 AM IST

హైదరాబాద్‌లో డబుల్ ట్రీ హోటల్ బైట్‌హిల్టన్ నిర్మాణం పేరిట రుణాలు పొంది మోసానికి పాల్పడ్డారని సప్తర్షిహోటల్స్ ప్రైవేట్‌ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో 200 గదులతో నాలుగు నక్షత్రాల హోటల్, 40 లగ్జరీ సర్వీస్ అపార్టుమెంట్ల నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు ముంబైకి చెందిన మహాహోటల్స్ ముందుకొచ్చింది. డాక్టర్ వైఎస్సార్ జాతీయ పర్యాటక, ఆతిథ్య నిర్వహణ సంస్థ- నిథమ్​తో కలిసి ప్రాజెక్టు చేపట్టేందుకు 2010లో ఒప్పందం జరిగింది. హిల్టన్‌వరల్డ్ వైడ్‌సంస్థ సాంకేతిక సహకారంతో డబుల్ ట్రీ బై హిల్టన్ పేరుతో ప్రాజెక్టును నిర్మించేందుకు మహాహోటల్స్ డైరెక్టర్లు ఎల్​ఎన్​శర్మ, యశ్‌దీప్ శర్మ, సునీత శర్మ నిర్ణయించారు. ఆ ప్రాజెక్టు కోసం సప్తర్షి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్​ను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పేరిట పంజాబ్ నేషనల్ కన్సార్టియం నుంచి రుణాలు తీసుకున్నారు.

నిధుల మళ్లింపు

వాయిదాలు చెల్లించకపోవడంతో సప్తర్షి హోటల్స్ యాజమాన్యాన్ని బ్యాంకులు పలుమార్లు సంప్రదించాయి. ఫోరెన్సిక్ ఆడిట్‌కు తొలుత సహకరించలేదని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పీఎన్​బీ తెలిపింది. కొంతకాలానికి ఫోరెన్సిక్ ఆడిట్ చేయడంతో రుణాల పేరిట పొందిన సొమ్ము.. ఇతర అవసరాలకు మళ్లించినట్లు గుర్తించారు. ప్రమోటర్ల నుంచి సేకరించిన 11 కోట్లను పీఎన్​బీ ఖాతాలో జమచేయలేదని గుర్తించారు. హోటల్‌లో ఫర్నీచర్, ఇంటీరియర్ మెటీరియల్ పేరిట అక్రమాలు జరిగినట్లు పీఎన్​బీ పేర్కొంది. అగస్త్య ట్రేడ్‌లింక్స్, ఖందాల్‌ ట్రేడింగ్, రజినీ గంధ డిస్ట్రిబ్యూటర్స్, సింబియాసిస్ ఎయిర్‌వర్స్క్‌కు... బిల్లులు చెల్లించినట్లు రశీదులున్నా ఆ సంస్థల నుంచి ఎలాంటి సరకు సరఫరా కాలేదని ఆడిట్‌లో తేలింది. పీఎన్​బీ ఫిర్యాదు మేరకు సప్తర్షి హోటల్స్, మహాహోటల్స్, వాటి డైరెక్టర్లు ఎల్​ఎన్​శర్మ, యశ్‌దీప్ శర్మ, సునీతశర్మతో పాటు అగస్త్య ట్రేడ్‌లింక్స్, ఖందాల్ ట్రేడింగ్, రజినీ గంధ డిస్ట్రిబ్యూటర్స్, సింబియాసిస్ ఎయిర్ వర్క్స్ పై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చదవండి: Loan Apps: 106 కోట్ల రూపాయలను జప్తు చేసిన ఈడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.