స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రుణం తీసుకుని మోసం చేసిన కేసులో హైదరాబాద్‌లోని పారిఖ్ ఫ్యాబ్రిక్స్ సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. సదరు సంస్థ నిర్వాహకులు 2003 నుంచి 2010 వరకు సుమారు రూ. 173 కోట్లు చెల్లించకుండా బ్యాంకును మోసం చేశారని అభియోగాల్లో పేర్కొంది.
రుణం తిరిగి చెల్లించకుండా మోసం చేశారన్న ఎస్బీఐ ఉన్నతాధికారులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్, చెన్నై నగరాల్లోని మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ నిర్వాహకులు తీసుకున్న రుణాన్ని ఇతర అవసరాలకు వినియోగించుకుని.. ఉద్దేశపూర్వకంగా నష్టాలు చూపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. డబ్బులు ఎక్కడెక్కడికి తరలించారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఈ ఎన్నికల్లో ఓటర్లు డబ్బుకు అమ్ముడు పోవొద్దు'