కామరెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో కుల బహిష్కరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన చాకలి యాదయ్య కుటుంబాన్ని మూడు నెలల క్రితం కులం నుంచి బహిష్కరించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. వివాదాన్ని సద్దుమణిగించారు. మళ్లీ కొద్ది రోజులకు.. కుల సంఘం సభ్యుల నుంచి వేధింపులు ఎదురవ్వడంతో మనో వేదనకు గురైన యాదయ్య.. 15 రోజుల క్రితం మృతి చెందాడు.
యాదయ్య అంత్యక్రియలకు కుల పెద్దలెవరూ ముందుకు రాకపోవడంతో మృతుడి కొడుకు నర్సింహులు.. తన స్నేహితులు, బంధువులతో కలిసి కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అయినా వేధింపులు ఆగకపోగా గురువారం నాడు మళ్లీ.. మృతుడి భార్య బుచ్చవ్వ, కోడలు అవంతికలను కులం సభ్యులు అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన అవంతిక.. ఆత్మహత్యాయత్నం చేసింది. చేసేదేమీ లేక నర్సింహులు.. తల్లి, భార్యతో కలిసి మరోసారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
ఇదీ చదవండి: బైక్‌తో ఢీకొట్టి... పొలాల్లోకి లాక్కెళ్లి కత్తులతో నరికి చంపారు