Palvancha Family Suicide Case Update: భద్రాద్రిలోని వనమా రాఘవ అనుచరులపై పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తనను వనమా రాఘవ అనుచరులు వేధిస్తున్నారని పోలీసులకు రామకృష్ణ బావమరిది ఫిర్యాదు చేశారు. ఫోన్లో బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
''మా బావ ఆర్నేళ్ల క్రితం వరకు పాల్వంచలోనే ఉండి వ్యాపారం చేసుకునే వాళ్లు. తర్వాత అక్కడ వ్యాపారం మానేసి.. రాజమహేంద్రవరంలో మా దగ్గరకే వచ్చి అద్దె ఇంట్లో ఉండేవారు. పాల్వంచలోని అమ్మ, అక్కతో.. బావకి ఆస్తి గురించి పంచాయతీ జరుగుతుందని తెలిసింది. ఆ క్రమంలోనే బావ.. మా చెల్లి, పిల్లలతో కలిసి తన సొంత గ్రామానికి వెళ్లాడు. మరుసటి రోజు తెల్లవారుజాము 3.30గంటలకే వారు చనిపోయినట్లు ఫోన్ వచ్చింది.
ఇక్కడ వచ్చాక మా బావ సూసైడ్ నోట్, వీడియోలు పెట్టేసి.. మా చెల్లిని, మేనకోడళ్లను తీసుకుని చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాము. అప్పటి నుంచి వనమా రాఘవ అనుచరులు నన్ను బెదిరింపులకు గురిచేస్తున్నారు. కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. లేకుంటే నీకు మీ బావకి పట్టిన గతే పడుతుందని బెదిరించారు.''
-జనార్దన్
ఫోన్లో బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్న జనార్దన్.. కేసు వెనక్కి తీసుకోవాలని రాఘవ అనుచరులు ఒత్తిడికి గురిచేస్తున్నారని తెలిపారు. కేసు వెనక్కి తీసుకోకపోతే రామకృష్ణ కుటుంబానికి పట్టిన గతే పడుతుందని బెదిరించారని.. వాపోయారు.
ఇదీ చూడండి: Palvancha Family Suicide: 'నీ భార్యను హైదరాబాద్ తీసుకొస్తే.. నీ సమస్య తీరుతుంది'