ETV Bharat / crime

తాండూర్‌లో ఆడియో హీట్‌... ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్యలో సీఐ - ఆడియో వైరల్‌పై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రియాక్షన్

MLC Patnam Mahender Reddy Audio Viral Case: వికారాబాద్ జిల్లా తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుని పొలిటికల్ హీట్‌తు తెరలేపింది. ఫోన్‌లో పరుష పదజాలం ఉపయోగిస్తూ సీఐని బెదిరించిన కేసులో ఐపీసీ సెక్షన్లు 353, 504, 506ల కింద కేసు నమోదు చేసినట్లు వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్రకటించారు. దీనిపై స్పందించిన మహేందర్ రెడ్డి పోలీసులు నోటీసులు జారీ చేస్తే.. కోర్టుకు వెళ్లి ఈ విషయం తేల్చుకుంటానని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసులకు తమ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. దర్యాప్తులో అసలు విషయం తేలుతుందని సీఐ పేర్కొన్నారు.

audio
audio
author img

By

Published : Apr 28, 2022, 12:58 PM IST

Updated : Apr 28, 2022, 5:18 PM IST

MLC Patnam Mahender Reddy Audio Viral Case : వికారాబాద్ జిల్లా తాండూరు సీఐను దూషించిన వ్యవహారం తాండూర్‌లో అధికార పార్టీ నాయకుల మధ్య రచ్చ రేపుతోంది. ఈ వివాదంలో తెరాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డిపై కేసు నమోదైంది. సీఐను దూషిస్తూ మాట్లాడిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహేందర్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 353, 504, 506 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... వచ్చే ఎన్నికల్లో టికెట్‌ నాదంటే.. నాదంటూ.. పట్నం మహేందర్‌ రెడ్డి, రోహిత్‌ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఐని దూషించాడంటూ మహేందర్‌ రెడ్డిపై ఆరోపణలు వస్తుండగా... అదంతా రోహిత్‌ రెడ్డి పనేనంటూ మహేందర్‌ రెడ్డి విమర్శిస్తున్నారు.

మహేందర్ రెడ్డి రియాక్షన్ : మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో మహేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనకు నోటీసులిస్తే స్పందిస్తానని.. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు. తాను సీఐతో మాట్లాడానని.. అతణ్ని తిట్టలేదని చెప్పారు. సీఐని తిట్టిన ఆడియో తనది కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెరాస నేతలపై కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే ఇలా తప్పుడు ఆరోపణలు సృష్టిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస టికట్ తనదేనని.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మహేందర్ రెడ్డి వెల్లడించారు.

పోలీసులు నాకు నోటీసులిస్తే స్పందిస్తా. పోలీసులు నోటీసులిస్తే కోర్టులో తేల్చుకుంటా. నేను సీఐతో మాట్లాడా.. కానీ తిట్టలేదు. సీఐని తిట్టిన ఆడియో నాది కాదు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కావాలని నాపై ఇలా చేస్తున్నారు. తెరాస నేతలపై కాంగ్రెస్ నుంచి వచ్చినవాళ్లే ఇలా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస టికెట్ నాదే.. ఎమ్మెల్యేగా పోటీచేస్తా.

-- పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ

రోహిత్ రెడ్డి అనుచరుల ఆందోళన : మరోవైపు.. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇందిరాచౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు సీఐకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు అతణ్ని వెంటనే అరెస్టు చేయాలని కోరారు.

అది నిరూపించండి : మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పందించారు. తాను ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని.. తన పక్కన ఉన్న వారిని రౌడీషీటర్లు అంటే ఎలా అని ప్రశ్నించారు. పోలీసులకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. నిజంగానే తన పక్కన ఉన్న ఎవరిపై అయినా రౌడీషీట్ ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. తాండూరులో తెరాస జెండా మోపింది తానని చెప్పారు. తెరాసతోనే రాజకీయ అరంగేట్రం చేశానని వెల్లడించారు. పట్నం మహేందర్ రెడ్డి తెదేపా నుంచి తెరాసలో చేరారని.. ఆయన నిరాశ, నిస్పృహతో మాట్లాడుతున్నారని అన్నారు.

"వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టికెట్లని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారు. తెరాస హవాలోనూ నన్ను తాండూరు ప్రజలు గెలిపించారు. ఇటీవల జరిపిన సర్వేల్లో నాకే మొగ్గు వచ్చింది. వందశాతం తాండూరు టికెట్ నాదే. మహేందర్‌రెడ్డి పార్టీ మారతారా లేదా అనేది నాకు తెలీదు. నాకు మహేందర్‌రెడ్డి ప్రత్యర్థి కాదు.. ఆయనతో గొడవ అనవసరం. పోలీసులకు మా మద్దతుంటుంది."

- పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే

మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్న సీఐ రాజేందర్ రెడ్డి... పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. విచారణలో అసలు నిజాలు తెలుస్తాయని తెలిపారు.

ఎమ్మెల్సీ తిట్టిన విషయంలో పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. తాండూర్ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఎమ్మెల్సీపై కేసు నమోదైంది. ఆయన దూషించారా? లేదా? అనేది దర్యాప్తులో తేలుతుంది.

-- రాజేందర్ రెడ్డి, సీఐ

వివాదం రాజుకుందిలా..

తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో సోషల్‌ మీడియాలో బుధవారం వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. ఐదురోజుల క్రితం తాండూరులోని భావిగీ భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో రథోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో రౌడీషీటర్లకు పోలీసులు ప్రాధాన్యమిచ్చారని ఎమ్మెల్సీ ఆడియోలో ఆరోపించారు. వారికి కార్పెట్‌ ఎందుకు వేశారంటూ సీఐని దుర్భాషలాడుతూ నిలదీశారు. దీనిపై స్పందించిన సీఐ కార్పెట్‌ వేయటం తమ పని కాదని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్సీ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నీ అంతు చూస్తానని సీఐని బెదిరించారు.

పట్నం మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనలు

ఇవీ చదవండి :

Last Updated : Apr 28, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.