ETV Bharat / crime

Bulli Bai APP Case: 'బుల్లిబాయి యాప్​ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలి' - బుల్లిబాయి యాప్​ కేసు

Bulli Bai APP Case: మహిళలల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్న 'బుల్లిబాయి' నిందితులపై చర్యలు తీసుకోవాలని... మహిళ సామాజిక వేత్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఓ వర్గం మహిళల చిత్రాలను అభ్యంతరకర రీతిలో మార్ఫింగ్​ చేస్తున్నారని బాధిత మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Bulli Bai APP Case
బుల్లిబాయి యాప్​
author img

By

Published : Jan 5, 2022, 9:15 AM IST

ఓ వర్గం మహిళల ఫొటోలను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టిన నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఉమెన్‌ అండ్‌ ట్రాన్స్‌జెండర్‌ ఆర్గనైజేషన్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (డబ్ల్యూ.టి.ఒ.జె.ఎ.సి.) ప్రతినిధులు డిమాండు చేశారు. ‘బుల్లిబాయి’ పేరుతో వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి ఓ వర్గానికి చెందిన మహిళ ఫొటోను వేలానికి పెట్టిన వారిని తక్షణమే గుర్తించాలన్నారు. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్‌, రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌, సైబరాబాద్‌ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.

అందరూ బాధితులే..

వందల మంది మహిళలు.. ముఖ్యంగా పాత్రికేయులు, న్యాయవాదులు, ఉద్యమకారులకు సంబంధించిన ఫొటోలను వేలానికి పెట్టారని, ఇందులో తెలంగాణకు చెందిన యువ పాత్రికేయులతో పాటు ఎంతోమంది సామాజిక కార్యకర్తలు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే వీరి లక్ష్యమని ఆరోపించారు. మహిళలు ముఖ్యంగా ప్రజాసంఘాల ప్రతినిధులపై ఆన్‌లైన్‌లో వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతసామరస్యం కాపాడటంతో పాటు మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విశ్వాసం ప్రకటించారు. కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు వి.సంధ్య, పోటు కళావతి, సజయ, సత్యవాణి, సుజాత సూరేపల్లి, ఉషా సన్నిహిత, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..

ముస్లిం మహిళలను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హ్యూమన్‌రైట్స్‌ ఫోరం (హెచ్‌.ఆర్‌.ఎఫ్‌.) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్‌.కృష్ణ, ఎస్‌.జీవన్‌కుమార్‌లు డిమాండు చేశారు. ఈ మేరకు వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత జులైలో ఓ యాప్‌ ద్వారా ఇలాగే వేలానికి తెగబడ్డారని, పోలీసులు కేసు నమోదు చేసినా నిందితులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గిట్‌హబ్‌ నిర్వాహకులను వారు కోరారు.

ఇదీ చూడండి: Bulli Bai APP: ఆ యాప్​లో మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చి అమ్మకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.