ETV Bharat / crime

Shamshabad Airport: వ్యక్తి మృతిపై ఫేబర్​ సింధూరీ సంస్థపై కేసు

శంషాబాద్​ ఎయిర్​​పోర్టులో డ్రైనేజీ పైప్​లైన్​ లీకేజీ ఘటన ఒకరిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనపై ఫేబర్​ సింధూరీ పెసిలిటీస్​ మేనేజ్​మెంట్​ సర్వీసెస్​ సంస్థపై శంషాబాద్​ పోలీసులు కేసును నమోదు చేశారు.

Case against filed on Faber Sindhuri Company over person death in Shamshabad Airport
Shamshabad Airport: వ్యక్తి మృతిపై ఫేబర్​ సింధూరీ సంస్థపై కేసు
author img

By

Published : Jun 18, 2021, 11:08 AM IST

శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో మురుగునీటి పైప్​లైన్​ శుభ్రం చేస్తున్న ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై ఫేబర్​ సింధూరీ పెసిలిటీస్​ మేనేజ్​మెంట్​ సర్వీసెస్​ సంస్థపై శంషాబాద్​ పోలీసులు కేసును నమోదు చేశారు. సంస్థ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. విమానాశ్రయంలో ప్రయాణికులు దిగే ప్రాంగణంలో మురికి నీటి పైప్​లైన్​ లీకేజీ ఏర్పడింది. నిన్న సాయంత్రం నర్సింహ్మారెడ్డి అనే కార్మికుడు పైపులు మరమ్మతు చేసేందుకు ప్రయత్నించాడు. పైపుల్లో ఉన్న అడ్డంకిని తొలగించేందుకు యాసిడ్​ పోశాడు. ఒక్కసారిగా యాసిడ్ ఘాటు వల్ల నరసింహ్మారెడ్డి అక్కడిక్కడే స్పృహ తప్పి పడిపోయాడు.

నరసింహ్మారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన జకీర్​, ఇలియాస్​లు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నరసింహ్మారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పనిచేసే సమయంలో ఫేబర్​ సింధూరి పెసిలిటీస్​ సర్వీసెస్​ సంస్థ.. సిబ్బంది భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

shamshabad: ఎయిర్​పోర్టులో డ్రైనేజీ పైప్​లైన్​ బాగుచేస్తూ ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.