Car crashes into a Foot wear Shop: ట్రాఫిక్ పోలీసులు ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా కొందరు గాలికొదిలేస్తున్నారు. జన సందడి అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన మూసిన చెప్పుల షాపు దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్ వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అధిక వేగంతో వచ్చిన కారు... రోడ్డు పక్కన షెటర్‌ను ఢీకొని ఆగిపోయింది. ఉదయం కాలినడక చేస్తున్న వారికి ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో కారు మీతిమిరిన వేగంతో ఉన్నట్లు గుర్తించారు. కారులో ఉన్న యువకులు సురక్షితంగా బయటపడ్డారు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం సమయంలో కారు 180 స్పీడ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రహదారి ప్రమాదాలపై ద్విచక్ర వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నా... కొందరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు ప్లెక్సీ బోర్డులు, ప్రమాద సూచికలు లాంటివి ఏర్పాటు చేస్తున్న వాహనదారులలో ఎలాంటి మార్పు రావట్లేదు. దీంతో రద్దీ సమయాల్లో ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, భారీ వాహనాల నియంత్రణపై ఆంక్షలు విధిస్తూ.. దృష్టి సారిస్తున్నా ఎక్కడో ఓ చోట ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ఇవీ చదవండి: