వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బేకరీ యజమాని పవన్ మృతి చెందాడు. బెంగళూరుకు చెందిన పవన్ హాసంపర్తి మండలం ఎల్కతుర్తిలో బేకరీ నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాత్రి బేకరీ పనులు ముగించుకొని ఎల్కతుర్తి నుంచి హన్మకొండ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. మార్గ మధ్యలో ఎల్లాపూర్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై రవీందర్, కానిస్టేబుల్ ప్రవీణ్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: బీచ్లో చోరీచేశాడు.. పోలీసులకు దొరికాడు...