ETV Bharat / crime

అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం - కారు బోల్తా పడిన ఘటనలో ఐదుగురికి గాయాలు

కారు ఆదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మహబూబ్​నగర్ జిల్లా మన్యంకొండ ఘాట్​రోడ్​లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

car accident in mahaboobnagar dist in manyamkonda ghat road  five persons injured
ఘాట్​రోడ్డులో అదుపుతప్పి కారు బోల్తా
author img

By

Published : Jan 21, 2021, 5:58 PM IST

దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఘాట్​రోడ్డులో అదుపుతప్పిన కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మహబూబ్​నగర్​ జిల్లా మన్యంకొండ ఘాట్​రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రుడు శ్రీనివాస్​రెడ్డిని జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్​ ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్‌కు చెందిన కుటుంబం దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘాట్‌రోడ్డులో కారు కిందకు దిగుతుండగా మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి గోడను ఢీకొట్టి కింద పడింది.

ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యం: ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.