సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న బస్సును వెనుకనుంచి వస్తున్న మరో బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో రెండున్నర ఏళ్ల పాపతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ నుంచి పటాన్ చెరు వెళ్తున్న సంగారెడ్డి డిపో బస్సును.. వెనుక నుంచి వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Liquor Sales: జోరుగా మద్యం విక్రయాలు.. ఖజానాకు ఆదాయం ఫుల్!