ETV Bharat / crime

రోడ్డు పక్కన కాలిపోయిన వ్యక్తి మృతదేహం.. ఏం జరిగి ఉంటుంది.?

ఏం జరిగిందో.. ఎలా జరిగిందో.. హత్యా.. ఆత్మహత్యా.. లేక ప్రమాదమా..? రోడ్డు పక్కన కాలిపోయి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని చూసి స్థానికులు, పోలీసులు భావిస్తున్న అనుమానాలు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పహాడి షరీఫ్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

burnt dead body found at road side
రోడ్డు పక్కన కాలిపోయిన వ్యక్తి మృతదేహం
author img

By

Published : Oct 20, 2021, 12:54 PM IST

రోడ్డు పక్కన పూర్తిగా కాలిపోయిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​ శివారు పహడి షరీఫ్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పహడి షరీఫ్ నుంచి మామిడిపల్లి వెళ్లే రోడ్డు పక్కన నిర్మానుష్య ప్రదేశంలో ఓ వ్యక్తి మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన మృతదేహాన్ని పరిశీలించి.. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి.. గుర్తు తెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి ఇక్కడ తగలబెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Gutka business in hyderabad: రాజధానిలో యథేచ్ఛగా గుట్కా వ్యాపారం.. ఆదాయం తెలిస్తే షాకవుతారు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.