ట్రాక్టర్లో తరలిస్తున్న పశుగ్రాసం విద్యుదాఘాతానికి గురై పూర్తిగా దగ్ధమైన ఘటన యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం పోతిరెడ్డిపల్లిలో జరిగింది. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది.
గ్రామానికి చెందిన రైతు వెంకట్ రెడ్డి.. గడ్డిని కొనుగోలు చేసి ట్రాక్టర్లో స్వగ్రామానికి తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రూ. 20 వేల నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు.
ఇదీ చదవండి: బ్లాక్లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు.. ముఠా అరెస్టు