ETV Bharat / crime

VSP bullets seize: విశాఖలో కలకలం.. వృద్ధురాలి బ్యాగ్​లో బుల్లెట్లు..! - ap news

ఏపీలోని విశాఖ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగ్‌లో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు 13 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఆర్‌కే బీచ్‌ సమీపంలో నివాసముండే తిపురాని సుజాత(73) హైదరాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్తుండగా.. వృద్ధురాలి బ్యాగును తనిఖీ చేసిన అధికారులు బుల్లెట్లను గుర్తించి.. ఎయిర్​పోర్టు పోలీసులకు అప్పగించారు.

VSP bullets seize
విశాఖలో కలకలం
author img

By

Published : Oct 6, 2021, 5:29 AM IST

ఏపీలోని విశాఖ విమానాశ్రయంలో(Visakhapatnam airport news ) ఓ వృద్ధురాలి బ్యాగ్​లో బుల్లెట్లు కలకలం రేపాయి. ఆమె వద్ద నుంచి సీఐఎస్​ఎఫ్ అధికారులు 13 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు(Bullets seized from woman at airport news). విశాఖ ఆర్కే బీచ్ వద్ద నివాసం ఉంటున్న తిపురాని సుజాత(73) హైదరాబాద్ వెళ్లేందుకు ఇండిగో విమానం టిక్కెట్ తీసుకున్నారు. ఈ క్రమంలో వృద్ధురాలి బ్యాగును తనిఖీ చేసిన అధికారులు బుల్లెట్లను గుర్తించి.. ఎయిర్​పోర్టు పోలీసులకు అప్పగించారు.

బుల్లెట్లు అతడివేనా..!

ఆ వృద్ధురాలి పెద్దనాన్న పిస్టల్ లైసెన్స్ కలిగి ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన మృతి చెందటంతో ఆయన బ్యాగ్​లో వస్త్రాలు పెట్టుకుని హైదరాబాద్ వద్ద ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్తున్నానని.. బుల్లెట్లను తాను గమనించలేదని సుజాత వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

Telugu Academy Case: 'నిర్లక్ష్యమే కొంపముంచింది..' నిధుల గోల్​మాల్​పై సర్కార్​కు నివేదిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.