నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్లలో మేతకు వెళ్లిన ఎద్దుపై పులి దాడిచేసింది. ఈ ఘటనలో ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన రామావత్ జంకిలాల్కు చెందిన ఎద్దులు మానువడ్డ మాగు సమీపంలో మేతకెళ్లి వచ్చేవి. కానీ ఈరోజు ఓ ఎద్దు రాలేదు. దానికోసం గాలించగా... అడవిలో ఎద్దు కళేబరం కనిపించింది.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అమ్రాబాద్ రేంజ్ అటవీ అధికారులు... పులి ఆనవాళ్లను కనుగొన్నారు. ఎద్దు కళేబరానికి పంచనామా నిర్వహించి దహన సంస్కారాలు చేశారు. నల్లమలలో పులులు సంచరిస్తూ ఉంటాయని... వాటికి ఎవ్వరూ హానిచేయొద్దని హెచ్చరించారు. ఎద్దును కోల్పోయిన రైతుకు అటవీశాఖ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: ప్రగతి భవన్ వద్ద నర్సింగ్ అభ్యర్థుల ఆందోళన