ETV Bharat / crime

Old City Murder: రోడ్డుపై కారు ఆపి వ్యక్తిని బయటకు లాగి హత్య - Brutal murder in old city hyderabad

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం (Old City Murder) చోటుచేసుకుంది. నడిరోడ్డుపై కారులో ఉన్న వ్యక్తిని బయటకు లాగి హత్య చేసిన ఘటన కలకలంరేపింది. అచ్చం సినిమాల్లో జరిగే హత్యకాండ దృశ్యాన్ని తలపించింది. ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

Old City Murder
పాతబస్తీలో దారుణం
author img

By

Published : Oct 13, 2021, 8:16 PM IST

రద్దీగా ఉన్న రోడ్డు.. కారును ఓవర్​టేక్ చేయాలంటేనే చాలా కష్టంతో కడుకున్న పని అలాంటిది అంత రద్దీలోనూ కారును వెంబడించి.. ఓవర్​టేక్ చేసి అందులో ఉన్న వ్యక్తిని దుండగులు బయటకు లాగారు. ఆ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడి అనంతరం కత్తులుకటార్లతో హత్య చేశారు. ఇదంతా ఏదో సినిమాలోని స్టోరీ అనుకుంటే మీరు పొరబడినట్లే. కాదు ఇదంతా అక్షరాల నిజం. ఒళ్లుగగుర్పొడిచేలా ఓ వ్యక్తిని పాతబస్తీలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కిరాతకంగా నరికి చంపారు.

సినిమాల్లో చూయించినట్లుగానే... వ్యక్తిపై దాడి చేస్తున్న క్రమంలో ఆపడానికి ఓ ఎక్కరూ సాహసించలేదు. ప్రాణం భయంతో పరుగులు తీశారు. ఎవరో ఒకరు పోలీసులకు సమాచారమిస్తే... వాళ్లు వచ్చేదాకా ఆ వ్యక్తి రక్తపు మడుగులోనే ఉన్నాడు. కొనఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని అంబులెన్స్​లో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. తీవ్ర రక్తస్రావం అయిన బాధితుడు ప్రాణాలు ఒదిలాడు.

పట్టపగలు... నడిరోడ్డుపై..

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓల్డ్​సిటీ హస్మాబాద్ బండ్లగూడ రోడ్డుపై బార్కస్ ప్రాంతానికి చెందిన హమీద్ జుబేది తన కారులో చాంద్రాయణగుట్ట నుంచి వెళ్తుండగా హస్మాబాద్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కారు ఆపారు. అనంతరం హమీద్ జుబేదిని బయటకు లాగి మరణాయుధాలతో (Old City Murder) దాడి చేసి పారిపోయారు. నడిరోడ్డుపై వ్యక్తిని నరకగా... జనమంతా భయభ్రాంతులకు గురయ్యారు.

Old City Murder
మృతుడి కారు

సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటన స్థలానికి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. రోడ్డుపై మరణాయుధాలతో దాడి చేయడం వల్ల అక్కడ నుంచి వెళ్లే వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ట్రాఫిక్​కు కూడా అంతరాయం ఏర్పడింది. కేసు నమోదు చేసుకొని చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నడిరోడ్డుపై హత్యాకాండ జరగడం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ఇదీ చూడండి: Murder for hundred rupees: వంద రూపాయల కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య పోట్లాట... చివరకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.