Murder in Srikakulam: శ్రీకాకుళం పట్టణం గోనపాలెంలో నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. డీఎస్పీ కార్యాలయానికి సమీపంలో ఘటన జరిగింది. ప్రత్యర్థులు.. ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో కరుణ్ రాజ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాకి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఉగాది తర్వాత కేంద్రంపై ఉద్ధృత పోరాటం'