ETV Bharat / crime

SUICIDE: ఉదయం మూడు ముళ్లేసి.. రాత్రికి ఉరేసుకున్నాడు - తెలంగాణ నేరవార్తలు

పెళ్లి బట్టలకు అంటుకున్న పసుపు తడి ఆరనే లేదు.. పెళ్లింటికి వచ్చిన బంధువుల కోలాహలం ఇంకా తీరనే లేదు.. ఉదయం మూడు ముళ్లేసిన వరుడు.. రాత్రికి విగత జీవిగా మారాడు.

bride groom commits suicide
bride groom commits suicide
author img

By

Published : Jun 21, 2021, 6:32 PM IST

Updated : Jun 21, 2021, 7:17 PM IST

పచ్చని తోరణాలతో కళకళలాడిన ఆ ఇంట్లో అంతలోనే విషాదఛాయలు అలముకున్నాయి. అంతవరకు పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో.. ఒక్కసారిగా ఆర్తనాదాలు వినిపించాయి. కలకాలం తోడుంటాడనుకున్న భర్త.. మూడుముళ్లేసిన గంటల వ్యవధిలోనే విగతజీవిగా మారాడు. ఉరి వేసుకొని నవవరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన సూర్యాబాబుకు స్థానిక యువతితో ఆదివారం ఉదయం వైభవంగా వివాహం జరిగింది. ఆ చూడ ముచ్చటైన జంటను చూసి వచ్చిన అతిథులు కలకాలం కలిసి ఉండాలంటూ ఆశీర్వదించి వెళ్లారు.

తమ కుమార్తె ఓ ఇంటికి చేరిందని వదువు తల్లిదండ్రులు సంబురపడ్డారు. తన దాంపత్య జీవితం సుఖంగా గడిచిపోవాలనే ఆకాంక్షతో మెట్టినింట నవవధువు అడుగెట్టింది. అయితే ఆ సంబురాలు, ఆశలు.. తెల్లారేసరికే అడియాసలయ్యాయి.

ఉరి వేసుకొని పెళ్లికుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫలితంగా ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఉదయం పెళ్లికుమారుడిగా కనిపించి.. రాత్రికి విగత జీవిగా మారిన కుమారున్ని చూసి.. తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. అయితే బలవన్మరణానికి గల కారణాలు తెలియలేదు.

బాధితుల ఫిర్యాదులో పోలీసులు కేసునమోదుచేసుకున్నారు. మృతదేహాన్ని అలంపూర్​లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీచూడండి: చావులోనూ వీడని రక్తసంబంధం.. ప్రమాదవశాత్తు చెరువులో పడి వైద్యులు మృతి

Last Updated : Jun 21, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.