సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని ఇటుకల బట్టీలో పనిచేసే ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రెండురోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.
అన్నారం గ్రామంలో శ్రీధర్‌కు చెందిన ఇటుకుల బట్టీలో ఒడిశాకు చెందిన హిమాన్షు పటేల్.. కార్మికుడిగా పని చేసేందుకు వచ్చాడు. ఈ నెల 11వ తేదీ రాత్రి 10 గంటలకు అతను కనిపించకుండా పోయాడు. అతని భార్య భీమాలి, తోటి కార్మికులు వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు.
రెండు రోజుల తర్వాత బట్టీలో ఇటుకలు తీస్తుండగా హిమాన్షు పటేల్ మృతదేహం కనిపించింది. పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేసినట్లుగా యజమాని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: నాణ్యత లేని శానిటైజర్లు స్వాధీనం.. అదుపులో నిందితులు