ETV Bharat / crime

నో మ్యుటేషన్లు... ఏడాదిగా నిలిచిన 2,500 దరఖాస్తులు..! - రిజిస్ట్రేషన్​లలో అవినీతి

ఎప్పట్నుంచో ఆస్తిపన్ను కడుతున్నారు. ఇంటిని రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నారు. అయినా కొత్త యజమాని పేరుతో ఆస్తిపన్ను రసీదును మార్చేందుకు జీహెచ్‌ఎంసీ మొండికేస్తోంది. కొందరు బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, ఉప కమిషనర్లు.. పాతకాలం చెక్‌లిస్టును అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారు.

bribe-for-mutations
నో మ్యుటేషన్లు
author img

By

Published : Oct 25, 2021, 11:42 AM IST

మ్యుటేషన్ల దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ ఆదేశించినా ఖాతరు చేయట్లేదు. దరఖాస్తుకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. పాతబస్తీ, ఖైరతాబాద్‌, మెహిదీపట్నం ప్రాంతాల్లో కిందిస్థాయి సిబ్బంది దరఖాస్తుదారులను రూ.5 వేల చొప్పున లంచం డిమాండ్‌ చేస్తున్నారు. ఇవ్వకపోతే.. ఏడాదైనా దరఖాస్తులను ముట్టుకోవట్లేదు. పైగా.. మీ ఇంటికి ఆస్తిపన్ను పెంచాల్సి ఉందని, జరిమానా వేస్తామని, రకరకాలుగా పౌరులను బెదిరిస్తున్నారు. ప్రస్తుతం అపరిష్కృత దరఖాస్తులు 2,500 ఉన్నాయి.

మ్యుటేషన్‌ అంటే..?

ఆస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ద్వారా జరిగితే, ఆ ఆస్తిని కొత్తగా కొన్న వారి పేరిట మార్చడాన్ని మ్యుటేషన్‌ అంటారు. రికార్డుల్లో పాత యజమాని పేరును తొలగించి, కొనుగోలుదారు పేరును చేర్చడం. సబ్‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ద్వారా నమోదు చేస్తారు. ఆ పత్రాల ఆధారంగా జీహెచ్‌ఎంసీ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు మ్యుటేషన్‌ చేస్తారు. ఇది పాత విధానం. ఈ ఏడాది జూన్‌ 15 వరకు కొనసాగింది. అప్పట్నుంచి రాష్ట్ర సర్కారు ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్లు పూర్తయ్యే సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ.. కొందరి మ్యుటేషన్లు జరగట్లేదు. గతంలో మాదిరి దరఖాస్తులను తొక్కిపెట్టడం, యజమానిని భయపెట్టి జేబులు నింపుకోవడం కొందరికి పరిపాటిగా మారింది.

వసూళ్లు ఇలా..

  • ఏడాది క్రితం సికింద్రాబాద్‌కు చెందిన ఓ కుటుంబం మ్యుటేషన్‌తోపాటు, ఇంటి నంబరులో మార్పు కోరుతూ దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు సర్కిల్‌ అధికారులు దరఖాస్తు ముట్టుకోలేదు. కుటుంబ సభ్యులు వారానికోసారి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
  • పరిష్కారానికి ఎదురుచూస్తోన్న దరఖాస్తులు ముషీరాబాద్‌ సర్కిల్‌లో ఎక్కువగా ఉన్నాయి. ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, చార్మినార్‌ జోన్లలోని సర్కిళ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • మెహిదీపట్నం సర్కిల్‌కు చెందిన ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌, బిల్‌ కలెక్టర్‌ ఇటీవల దరఖాస్తుదారు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. అయినా సంబంధిత అధికారులు తీరు మార్చుకోవట్లేదు.
  • సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంలో సాంకేతిక సమస్యలతో కొన్ని మ్యుటేషన్లు జరగట్లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం అలాంటివి 1,400 ఉన్నాయి. వాటిని నేరుగా ఆమోదించాలని, వివాదాలుంటే తిరస్కరించాలని కమిషనర్‌ మొదట్నుంచి ఉప కమిషనర్లను ఆదేశిస్తున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు.
  • గతంలో రిజిస్ట్రేషన్లు జరిగి, ఆస్తిపన్ను రికార్డుల్లో పేరు మార్చుకోని యజమానులు.. ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుంటారు. వాస్తవానికి అలాంటి దరఖాస్తులను పౌర సేవా కేంద్రాలు నేరుగా తీసుకోవాలి. బిల్‌ కలెక్టర్‌ లేదా ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌తో బేరం కుదుర్చుకుంటేనే సిబ్బంది దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇలా తీసుకున్న దరఖాస్తులు ప్రస్తుతం 1,100 అపరిష్కృతంగా ఉన్నాయి.

ఇదీ చూడండి: police: బాధితులతోనే పోలీసుల సెటిల్​మెంట్లు.. ఠాణాలే వేదికలు

ఆ అవినీతి తిమింగలాలను పట్టుకొచ్చి, తిన్నది కక్కిస్తేనే..

Corruption in Adilabad: అంతుబట్టని రహస్యం.. తెరవెనుక అదృశ్యశక్తి ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.