ETV Bharat / crime

BOY MURDER CASE: బాలుడు తనీష్​రెడ్డి హత్య కేసు నిందితుడు అరెస్ట్​ - క్రైమ్ వార్తలు

ఏపీలోని క‌డ‌ప‌ జిల్లా వెంగళాయపల్లెకు చెందిన జి.తనీష్‌రెడ్డి (9) హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడి హత్యకు కారణమైన నిందితుడు దస్తగిరిని అరెస్ట్​ చేశారు.

BOY MURDER CASE
BOY MURDER CASE
author img

By

Published : Aug 13, 2021, 10:32 PM IST

Updated : Aug 14, 2021, 10:51 AM IST

ఏపీలోని క‌డ‌ప‌ జిల్లా రాజుపాలెం మండలం వెంగళాయ‌ప‌ల్లెలో అదృశ్యమై శవంగా తేలిన బాలుడు తనీష్​రెడ్డి (9) కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 7న అదృశ్యమై 9న శవమై కనిపించిన త‌నీష్‌రెడ్డిని.. దస్తగిరి అనే వ్యక్తి గొంతు నులిమి చంపినట్లు పోలీసులు తెలిపారు. ద‌స్త‌గిరి కుమార్తె(10)తో త‌నీష్‌రెడ్డి తరచూ గొడ‌వ‌ప‌డుతుండేవాడని.. అది మ‌నసులో పెట్టుకొని బాలిక తండ్రే హ‌త్య చేశాడని డీఎస్పీ ప్రసాదరావు వెల్ల‌డించారు. ప్ర‌జ‌లు అపోహ‌ ప‌డుతున్న‌ట్లు బాలుడి మృతి న‌ర‌బ‌లి కాద‌న్న డీఎస్పీ.. తనీష్​ ఒంటిపై గాయాలేవీ లేవ‌ని స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..

రాజుపాలెం మండలం వెంగళాయపల్లెకు చెందిన జి.తనీష్‌రెడ్డి ఈ నెల 7 నుంచి కనిపించడం లేదని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద ఎస్సై కృష్ణంరాజు నాయక్‌ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు సోమవారం రాత్రి... గ్రామం వెలుపల వైఎస్‌ఆర్‌ విగ్రహం సమీపంలోని తాగునీటి కేంద్రానికి వెనుక వైపు ముళ్ల పొదల్లో బాలుడు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు సంజీవరెడ్డి, శోభారాణి బోరున విలపించారు. బాలుడు శవమై కన్పించడంతో అందుకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నామని సీఐ మధుసూదన్‌ గౌడ్‌ తెలిపారు.

ఇదీచూడండి: CRIME: తల్లిని కొట్టాడని.. మేనమామపై కత్తితో దాడి

Last Updated : Aug 14, 2021, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.